యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభమేళా కోసం వస్తున్న సాధువులు కఠిన దీక్షలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. నాగ సాధువు ప్రమోద్ గిరి మహారాజ్ రోజూ తెల్లవారుజామున 4 గంటలకు 61 కుండల చన్నీటి స్నానం చేస్తున్నారు. హఠయోగాలో భాగంగా 41 రోజులపాటు ఇలా చేయాల్సి ఉండగా సమయభావం వల్ల 21 రోజులకు కుదించినట్లు ఆయన తెలిపారు. ఈ దీక్ష పూర్తయ్యాక 108 కుండల నీటితో స్నానం చేస్తానన్నారు.