AP: ముంబై నటి జెత్వానీ కేసులో ఐపీఎస్‌లు, పోలీసులకు హైకోర్టు ఊరట కల్పించింది. ఐపీఎస్‌లు కాంతిరాణా, విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది. విద్యాసాగర్ ఫిర్యాదుతో పోలీసులు తనను వేధించారని జెత్వానీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాము నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని వారు తెెలిపారు.