నేపాల్‌ను భారీ భూకంపం వణికించింది. 7.1 తీవ్రతతో సంభవించిన భూప్రకంపనల ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. పలు చోట్ల భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద ఇప్పటివరకూ 36 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్‌లో భూకంపం సంభవించడం వల్ల భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి.