చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం

70చూసినవారు
చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం
AP: రాష్ట్రాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే విధంగా చర్యలు చేపట్టనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్