ఏపీలో మరో కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం భవన నిర్మాణాలకు అనుమతుల పేరుతో ముప్పు తిప్పలు పెట్టింది. భవన నిర్మాణ యజమానుల బాధ్యతలను అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతికి లైసెన్స్డ్ సర్వేయర్ లేదా ఇంజనీర్ల ప్లాన్ సమర్పిస్తే చాలని ప్రకటించింది. ఆ ప్లాన్ ప్రకారమే భవనాలను నిర్మించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.