ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను చిన్న వివాదం కారణంగా నడిరోడ్డుపై ఘోరంగా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఓ యువకుడు మహిళ గొంతు పట్టుకుని చిత్రహింసలకు గురి చేశాడు. ఈ ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి విమర్శలొస్తున్నాయి .