వైఎస్ జగన్ అవినీతి ఖండాంతరాలు దాటిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అమెరికాలో వేసిన కేసుపై అధ్యయనం చేస్తున్నామని, గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు చేపడతామని అన్నారు. ఈరోజు జగన్పై వచ్చిన ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినే పరిస్థితి ఉందన్నారు. వాస్తవాలు వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు.