ఏపీలో YCPని తొక్కిపెట్టడమే పవన్ లక్ష్యమని రాజకీయ వర్గాలు గుసుగుసలాడుతున్నాయి. వైసీపీ రహిత రాజకీయం రావాలని కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోరుకున్నారు. అందుకే సీఎం సీట్లో చంద్రబాబే ఉండాలంటూ జనసైనికుల ఆశలు మొగ్గలోనే తుంచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ఒక ఎత్తు అయితే వైసీపీని రాజకీయంగా ఎలిమినేట్ చేయడం మరో ఎత్తు. అందుకే ఆ పార్టీని అంతం చేయాలంటే కూటమితోనే సాధ్యమని.. బాబు నాయకత్వమే మేలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.