భర్త చేతిలో దారుణ హ‌త్య‌కు గురైన మహిళా పోలీసు అధికారి

51చూసినవారు
భర్త చేతిలో దారుణ హ‌త్య‌కు గురైన మహిళా పోలీసు అధికారి
కేరళలోని కన్నూర్ జిల్లాలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా పోలీసు అధికారిని ఆమె భర్త అతి కిరాతకంగా తగలబెట్టి మరీ చంపేశాడు. కాసర్‌గోడ్ జిల్లా చందేరా పిఎస్ లో సివిల్ పోలీస్ ఆఫీసర్ గా పని చేస్తున్న దివ్యశ్రీ కుటుంబ కలహాల కారణంగా తన భర్త రాజేష్ తో విడిపోయి పేరెంట్స్ తో ఉంటోంది. ఈ క్రమంలోనే దివ్యశ్రీ ఇంటికెళ్లిన రాజేష్ ఆమెపై దాడి చేసి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్