ఏపీ శాసనమండలి నేడు పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ బిల్లు, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ల సవరణ బిల్లు, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ల చట్ట సవరణ బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది. బోర్డు సభ్యుల నియామకాల్లో వివక్ష చూపకుండా నిరోధిస్తూ 3 చట్టాల సవరణకు ఏపీ శాసనమండలి నిర్ణయం తీసుకుంది.