రాత్రివేళ జీన్స్ ధరించి నిద్రించడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా జీన్స్ బిగుతుగా ఉండి.. శరీరానికి సరిగ్గా గాలి తాకనివ్వవు. అలాగే చెమటను పీల్చుకోదు. దీని వల్ల చర్మంపై తేమ ఎక్కువగా ఉండి ఫంగస్, బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. టైట్ జీన్స్ రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. పొట్టపై ఒత్తిడి పెంచుతాయి. దీని వల్ల ఉదర సమస్యలు వస్తాయి.