ఏపీలో త్వరలో శాప్ యాప్ ప్రారంభిస్తామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రకటించారు. గురువారం క్రీడా సంఘాలతో మంత్రి ప్రసాద్ భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో శాప్ ఛైర్మన్ రవినాయుడు క్రీడా సంఘాలను సమావేశ పరిచారు. రాష్ట్ర స్థాయిలో క్రీడారంగం బలోపేతంపై ఈ భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది.