AP: మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని మైదుకూరు సభా వేదికపై సీఎం చంద్రబాబుకు TDP పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. YSR జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో CM పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు కడప విమానాశ్రయంలో జిల్లా నేతలు, అధికారులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.