సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఈ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఈ విషయం తెలిసిన జగన్, భారతి రెడ్డి బెంగళూరులో ఉంటూ ఏడుస్తున్నారు. నీ లాగా ఊరికో ప్యాలెస్ ఉన్న వాళ్లకు ఇవ్వరమ్మా. లేదు నాకు కూడా కావాలి అంటే జగన్ నువ్వు వచ్చి ఒక అర్జీ పెట్టుకో మా ప్రభుత్వం ఆలోచిస్తుంది" అని సీఎం తెలిపారు.