మూసీ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందన్నారు. వారికి ప్రభుత్వం ఇళ్లు, జీవనోపాధిని కల్పిస్తుందన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో అని ప్రతిపక్షాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఇళ్లు ఇద్దామా? ప్రత్యామ్నాయంగా డబ్బులిద్దామా? స్థలాలిద్దామా? అనే దానిపై ప్రతిపక్షాలు వివరణ ఇవ్వాలన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొట్టే పనులు మానుకోవాలని సీఎం కోరారు.