ప్రపంచంలో గొప్పగొప్ప యుద్ధాలు మన అనుకున్న వాళ్లతోనే! వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఇలానే ఉంది ఇప్పుడు. అధికారం పోయినా.. జనం తరఫున చంద్రబాబు మీద యుద్ధం చేద్దాం అనుకుంటే.. సీన్ రివర్స్ అయింది. కుటుంబంలో, కుటుంబంతో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ శ్రేణులను టెన్షన్ పెట్టిస్తోంది. జగన్ సార్.. ఇప్పటికైనా ఫుల్‌స్టాప్ పెట్టండి అంటున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు పార్టీ పరువు దెబ్బతింటుందని కొందర జగన్ ను హెచ్చరిస్తున్నారు.