TG: నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన తిరుపతయ్య (60) అనే వృద్ధుడు ఆకలి అవ్వడంతో రోడ్డు పక్కన ఉన్న మిర్చి బండి దగ్గరకు వెళ్ళాడు. అనంతరం తిరుపతయ్య గుడ్లు ఆర్డర్ పెట్టుకుని తింటుండగా గొంతులో గుడ్డు ఇరుక్కుని ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.