AP: గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్‌ను స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఆర్టీసీ కాలనీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తమకు తెలియకుండా కార్యక్రమం ఎవరు ఏర్పాటు చేయమన్నారని స్థానిక టీడీపీ నేత ఫిరోజ్ ఎమ్మెల్యేపై కత్తితో దాడికి దిగారు. ఈ ఘటనపై ఎస్పీ కార్యాలయంలో గుంటూరు టీడీపీ నేతలు నేడు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.