మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా,గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అత్యవసరం విభాగంలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.