ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులకు కేరళలో కష్టాలు మొదలయ్యాయి. గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధి వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు వెళ్లారు. మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారి వాహనం చిక్కుకుందని పేర్కొన్నారు. ఈ విషయంలో కేరళ పోలీసులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చేసేది ఏమీ లేక ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎలాగైనా తమకు సాయం చేయాలని వేడుకుంటున్నారు.