కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద బుధవారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజంపేట నుండి బొప్పాయి కాయల లోడుతో గుంటూరు వెళుతున్న బొలెరో ఆటో జాతీయ రహదారి వద్ద భ్రమరా వెంచర్ వద్దకు వచ్చేసరికి ముందు టైరు పగిలిపోవటంతో నెమ్మదించింది. ఈ క్రమంలో వెనక నుండి వస్తున్న లారీ బొలెరో ఆటో ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆటో, లారీ డామేజ్ అయ్యాయి.