ఏపీ ఛాంబర్ ఆధ్వర్యంలో విజయవాడలో నేడు బిజినెస్ ఎక్స్పో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోకపోవడంతో చాలా పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక విధానాలను అమలు చేస్తుందన్నారు.