పంగులూరు మండలం కొండమూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహిళా కూలి వెంకటేశ్వరమ్మ పొలం వెళ్లి పాము కాటుకు గురై మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పొలంలో పనిచేస్తున్న ఆమెను పాము కాటు వేయగా తోటి కూలీలు ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. రేణింగవరం పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని ప్రమాదం చేరిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేశారు.