గుంటూరు: రాష్ట్రంలో ఆరోగ్య సేవలు అటకెక్కాయి

52చూసినవారు
గడిచిన 6నెలలుగా ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలు అటకెక్కాయని మాజీ మంత్రి విడదల రజిని విమర్శించారు. గుంటూరు శ్యామలానగర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడారు. ఆరోగ్య శ్రీని ఒక పద్దతి ప్రకారం అనారోగ్య శ్రీగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలకు మెరుగులద్ది ప్రజలకు అందించామని గుర్తుచేశారు.
Job Suitcase

Jobs near you