వేటపాలెం - చీరాల బైపాస్ రోడ్డులో పందిళ్ళపల్లి క్రాస్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఆ క్రాస్ లో పైకెక్కుతున్న కారు చిన్నగంజాం నుండి ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ తో సహా ఇద్దరు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.