చీరాల రవాణా శాఖ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనంద్ బాబు ఆదివారం డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. 2023 నుంచి పలు అర్జీలు పెండిగ్ లో పెట్టారని, లంచం ఇస్తేనే పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే విషయంపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.