చీరాల ఐటీసీలో ఉద్యోగం ఇప్పిస్తామని పోలిరెడ్డి అనే ఓ నిరుద్యోగికి నమ్మించి వాడరేవు రప్పించారు. అనంతరం చంపుతామని బెదిరించి అతడి నుండి రూ. 1. 5 లక్షల రూపాయలు దోచుకున్న నలుగురిని పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. వారి నుండి లక్ష రూపాయలు రికవరీ చేసినట్లు డీఎస్పీ జగదీష్ నాయక్ మీడియాకు చెప్పారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులు పోలా హరీష్, కౌశిక్ లు పరారీలో ఉండగా వారికోసం గాలిస్తున్నామన్నారు.