వైసీపీ గుంటూరు నగర అధ్యక్షుడిగా నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అతిథిగా హాజరై డైమండ్ బాబును ఆశీర్వదించి మాట్లాడారు. వైసీపీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు పదవులు దక్కుతాయని చెప్పడానికి డైమండ్ బాబు నిదర్శనమని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారు.