గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదు దారులతో పోలీసు కార్యాలయం కిక్కిరిసిపోయింది. ఎస్పీ సతీశ్ కుమార్, ఏఎస్పీ రమణమూర్తి, డీఎస్పీలు మల్లికార్జున రావు, రమేశ్, సుబ్బారావులు ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదు దారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.