78వ భారత దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పిడుగురాళ్ల పట్టణంలోని జడ్పీ హైస్కూల్లో గురజాల ఎమ్మెల్యే యరపతినేని భారతదేశ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం స్వాతంత్రానికి శాంతికి చిహ్నంగా తెల్ల పావురాలను ఎగరవేశారు. యరపతినేని మాట్లాడుతూ బ్రిటిష్ బానిస సంకెళ్ళ నుండి భారతదేశానికి స్వాతంత్రం తేవడం కోసం మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర ఆజాద్ లాంటి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారన్నారు.