నిబద్ధత కలిగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఎమ్మెల్సీగా గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఆదివారం గుంటూరులో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల కూటమి నాయకులు, కార్యకర్తల వివిధ ప్రజా సంఘాల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి బలపరిచిన ఆలపాటి గెలుపు గుంటూరు జిల్లా అభివృద్ధికి మలుపు లాంటిదని అన్నారు.