మంగళగిరి మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, గ్రామాలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా, యూనివర్సిటీ బస్సులు నిర్ణీత స్పీడులో నడపాలని మంగళగిరి రూరల్ సీఐ వై. శ్రీనివాసరావు, ఎస్సై వెంకట్ గురువారం తెలిపారు. నిడమర్రు రైల్వేగేటు, శిబిరం, బాబుజినగర్, నిడమర్రు, కురగల్లు మీదుగా వెళ్లే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బస్ డ్రైవర్లుకు, ట్రాన్స్ పోర్ట్, డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.