సూపర్ సిక్కు బడ్జెట్లో మొండి చేయి చూపారని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం విమర్శించారు. బడ్జెట్లో ఉచిత బస్సు ఊసే లేదని, నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించలేదని, రైతు భరోసా తల్లికి వందనం పథకాలకు అరా కోరగా, నిధులు కేటాయించి, నమ్మిన ప్రజలను కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. ప్రజలు కచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని గోపిరెడ్డి హెచ్చరించారు.