ఎన్నికలలో కూటమి పార్టీల నాయకులు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. నరసరావుపేట వైకాపా కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కూటమి పాలనపై, డిప్యూటీ సీఎం పవన్ పల్నాడు పర్యటనపై ఆయన విమర్శలు చేశారు. జగన్ పై రాజకీయ కుట్రతోనే కొనుగోలు చేసిన సరస్వతి భూములపై హడావిడి చేస్తున్నారని ఆయన తెలిపారు.