పెండింగ్ ఫీజులపై చర్చించి విడుదల చేయాలి : ఎస్.ఎఫ్.ఐ

85చూసినవారు
పెండింగ్ ఫీజులపై చర్చించి విడుదల చేయాలి : ఎస్.ఎఫ్.ఐ
పెండింగ్ లో ఉన్న విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు విడుదల చేయాలని, జీవో నెం. 77 రద్దు చేయాలని, విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కన్వీనర్ కోట సాయికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నరసరావుపేట కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.