పర్చూరు మండలం ఏదుబాడులో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం సాయంత్రం ఎస్ఐ మాల్యాద్రి తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి వద్ద నుండి 7200 నగదును స్వాధీన పరుచుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై మాల్యాద్రి చెప్పారు. మండల పరిధిలో ఎవరూ జూద కార్యకలాపాలు నిర్వహించరాదని ఆయన హెచ్చరించారు.