పొన్నూరు: అన్నదాతకు గిట్టుబాటు ధరపై సందిగ్ధం

64చూసినవారు
పొన్నూరు మండలంలో అన్నదాతలు వరికి గిట్టుబాటు ధర వస్తుందో లేదో అని సందిగ్ధంలో పడ్డారు. ఆరుగాలం పండించిన పంటకు ఫేoగల్ తుఫాను నష్టాన్ని మిగిల్చిందని ఆందోళన చెందుతున్నారు. వర్ష ప్రభావానికి రైతులు కల్లాల్లో దాన్యాన్ని పట్టాలు కప్పి రక్షించుకుంటున్నారు. రైతు సేవా కేంద్రంలో అమ్ముదామంటే తేమశాతం ఎక్కువగా ఉంది అని పంపించి వేస్తున్నారని బయట అమ్ముదామంటే క్వింటా ధాన్యంరూ. 12 వందలకు విక్రయించాల్సి వస్తుందంటున్నారు.