గుంటూరు జిల్లా కాకుమాను మండలం ఎస్టీ అంగన్వాడి కేంద్రంలో శనివారం బేటి బచావో -బేటి పడావో కళాజాత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కేంద్రం పరిధిలోనితల్లిదండ్రులకు బాల్య వివాహాలు, అక్రమ రవాణా, మహిళా చట్టాలపై కళాజాత బుర్రకథ రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సూపర్వైజర్ పి వెంకాయమ్మ అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.