గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామ పంచాయతీ గుమస్తా సుమారు రూ.2లక్షలతో ఉడాయించిన ఘటన సోమవారం తెలుగులోకి వచ్చింది. గ్రామంలో 18 మంది పింఛన్ దార్లకు పింఛన్ ఇవ్వకపోవడంతో పింఛనుదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పైఅధికారుల చొరవతో ప్రతిపాడు ఎంపీడీవో 18 మంది పింఛన్ దారులకు పింఛన్ పంపిణీ చేశారు. గుమస్తా సంబంధించిన వివరాలు ఎంపీడీవో గోప్యంగా ఉంచటంతో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.