ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టి చెరుకూరు మండలం కుర్నూతల గ్రామంలోని గాయత్రి జిన్నింగ్ మిల్లులో శుక్రవారం కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి ప్రారంభించారు. అనంతరం కేంద్రంలో పత్తి బేళ్ళను పరిశీలించి టెస్టింగ్ పరికరంతో పరీక్షించారు. సిసిఐ ద్వారా ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇస్తుందని వారు పేర్కొన్నారు.