చెరుకుపల్లి: 15 ఎకరాల గడ్డివాము దగ్ధం

65చూసినవారు
చెరుకుపల్లి: 15 ఎకరాల గడ్డివాము దగ్ధం
చెరుకుపల్లి మండలం ఆరుంబాక గ్రామ పంచాయతీలో శుక్రవారం 15 ఎకరాల వరిగడ్డి వాము దగ్ధమైంది. గ్రామానికి చెందిన తోట అప్పయ్య కు చెందిన గడ్డివాము పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల రూపాయలు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు అప్పయ్య తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పొన్నూరు నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Job Suitcase

Jobs near you