చెరుకుపల్లి మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు స్వర్గీయ మొఖమాటం పార్వతి నాలుగో వర్ధంతిని గురువారం చెరుకుపల్లి లోని ఘనంగా నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లాది రామకృష్ణ పార్వతి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల పరిషత్ అధ్యక్షురాలుగా పార్వతి చేసిన సేవలను కొనియాడారు. 2014 జూలై 5 నుండి 2019 జూలై 4 వరకు ఎంపీపీగా పనిచేశారు.