రాజుపాలెం మండలంలోని చోట పాపయ్య పాలెంలో మద్యం దుకాణం తీసివేయాలంటూ మహిళలు మద్యం షాప్ దగ్గర మంగళవారం ఆందోళన చేశారు. గ్రామంలో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వద్ద మందుబాబులు వీరంగం చేస్తున్నారని ఆరోపించారు. మద్యం దుకాణం తొలగించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. అధికారులు స్పందించి ఊరు మధ్యలో ఉన్న దుకాణాన్ని తొలగించాలని వారు కోరారు.