సత్తెనపల్లి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లను గురువారం రాత్రి జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్లలలో రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ కు వచ్చే వారిపట్ల మర్యాదతో మెలగాలని, కేసులు త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేసారు.