మాదిగ కార్పోరేషన్ డైరెక్టర్ గా కంభంపాటి శిరీషను నియమిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తుళ్లూరు మండలం లోని రాయపూడి గ్రామం. అమరావతి ఉద్యమంలో శిరీషా చురుకుగా ఉంటూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలోనే శిరీషపై పలు కేసులు నమోదయ్యాయి. కాగా ఇటీవలే మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండవల్లి శ్రీదేవిని నియమించిన విషయం తెలిసిందే.