తుళ్లూరు: పురుగు మందు తాగి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పురుగు మందు తాగి ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామానికి చెందిన మువ్వా సురేశ్(40) మృతి చెందాడు. తుళ్లూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన సురేశ్ భార్యతో గొడవపడి పురుగు మందు సేవించాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎన్నారై ఆసుపత్రికి తరలించగా వైద్యం తీసుకుంటూ బుధవారం మృతి చెందాడు. తుళ్లూరు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.