మేడికొండూరు మండల పేరేచర్ల గ్రామంలోని యం. ఎస్. ఎం. ఈ. ఆధ్వర్యంలో నెలకొల్పిన యూనిట్ ను మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ యూనిట్ ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని, తద్వారా స్థానిక నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో సహకరించవచ్చని కలెక్టర్ చెప్పారు.