ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుందని, పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.