చికిత్సకు వచ్చి.. ఆస్పత్రిలోనూ ఇరు వర్గాల ఘర్షణ

60చూసినవారు
చికిత్సకు వచ్చి.. ఆస్పత్రిలోనూ ఇరు వర్గాల ఘర్షణ
పల్నాడు జిల్లా క్రోసూరు మండలం హసనాబాద్‌‌కు చెందిన ఓ కుటుంబంలోని రెండు వర్గాల మధ్య గత 3 నెలలుగా ఆస్తి వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో రెండు వర్గాలు మధ్య ఘర్షణ తలెత్తింది. దాడిలో మున్ని, అబ్దుల్ బాసిక్, మరో వర్గానికి చెందిన బాజీ, బాషాలకు గాయాలయ్యాయి. సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్సకు వచ్చారు. అయితే ఆస్పత్రిలోనూ ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. తీవ్ర గాయాలైన ఇద్దరిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..

సంబంధిత పోస్ట్