బైక్‭ను ఆపినందుకు పోలీసును కొట్టిన తండ్రి కొడుకులు(వీడియో)

77చూసినవారు
పెట్రోలింగ్‌లో ఉన్న ఓ పోలీస్ అధికారిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. బాట్లా హౌస్ ప్రాంతంలో జామియా నగర్ పోలీస్ స్టేషన్ SHO నర్పాల్ సింగ్ ఆదివారం రాత్రి పెట్రోలింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ బుల్లెట్ బైక్ అధిక శబ్దం చేసుకుంటూ వెళ్తుండటంతో విచారణ నిమిత్తం ఆ బైక్‌ను ఆపి పరిశీలించారు. ఈ నేపథ్యంలో వివాదం తలెత్తి.. బైకర్ ఆసిఫ్ అతడి తండ్రి రియాజుద్దీన్ SHOను కొట్టారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్